ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా ప్రమోట్ చేసిన ఆకాశ ఎయిర్ లైన్స్ తొలి విమానం రెడీ అయింది. ఈ విమానానికి సంబంధించిన ఫోటోను ఆకాశ ఎయిర్ లైన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతే కాదు..ఖాళీగా కూర్చోలేం అంటూ దానికి క్యాప్షన్ జోడించింది. మరో ఫోటోలో త్వరలోనే గగనతలంలో విహరించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ లో తొలి విమానం ఆకాశ ఎయిర్ లైన్స్ చేతికి రానుంది.
అది వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు. అనంతరం జులైలో ఆకాశ ఎయిర్ లైన్స్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. విమానాలు రావటం తప్ప..ఇప్పటికే అన్ని అనుమతులను ఆకాశ ఎయిర్ లైన్స్ పొందింది. ఆకాశకు చెందిన తొలి బోయింగ్ 737 మ్యాక్స్ విమానం అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ లో తుది మెరుగులు దిద్దుకుంటోంది.