2022 మార్చి చివరి నాటికి ఈ అప్పులు ఉన్నట్లు తెలిపారు. దీంతో దేశంలోనే భారీ అప్పులు ఉన్న కార్పొరేట్ సంస్థగా ఇది అవతరించింది. ఏడాది కాలంలోనే అదానీ గ్రూపు అప్పులు ఏకంగా 42 శాతం మేర పెరిగినట్లు తేల్చారు. అయితే ఇంత భారీ స్థాయిలో అప్పులు ఉన్నా కూడా అదానీ గ్రూపు అప్పుల చెల్లింపు సామర్ధ్యం మెరుగ్గానే ఉందని విశ్లేషకులు చెప్పినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఆయా కంపెనీల ఆదాయం పెరగటం, కరోనా కారణంగా రెండేళ్ల పాటు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం కూడా అదానీ గ్రూపునకు కలిసొచ్చిన అంశంగా ఈ నివేదిక వెల్లడించిది. అయితే ఇప్పుడు దేశంలో ద్రవ్యోల్భణం భారీగా పెరుగుతుండటంతో పాటు..అనేక ఆర్ధిక సమస్యలు కారణంగా రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. వడ్డీ రేట్లు మరింత పెరిగితేమాత్రం ఆ ప్రభావం ఖచ్చితంగా అదానీ గ్రూపుపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార కార్యకలాపాల విస్తరణకు అదానీ గ్రూపు భారీ ఎత్తున రుణాలు సేకరిస్తోంది.