తెలంగాణ సీఎం కెసీఆర్ కూడా ఓ మీడియా సమావేశంలో మీరు ఎంత ప్రయత్నించినా..జగన్ కు..తనకు గొడవలు పెట్టలేరంటూ ఓ జర్నలిస్టుపై ప్రతినిధిపై మండిపడ్డారు. ఇది అంతా పక్కన పెడితే జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వైసీపీ అనుకూలురు..ఏపీకి చెందిన వారు చాలా మంది టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓట్లు వేసినట్లు విశ్లేషణలు వెలుగుచూశాయి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి ప్రాభల్యం ఉన్న చాలా చోట్ల టీఆర్ఎస్ గెలుపొందగా..స్థానికులు...పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు ఉన్న ప్రాంతాల్లో బిజెపి అనూహ్య విజయం సాధించింది. ఈ లెక్కన ఆంధ్రా ప్రాంత ప్రజలు ముఖ్యంగా వైసీపీ, జగన్ అభిమానులు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపినట్లు లెక్కలు వేశారు. తాజాగా కెటీఆర్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు..వైసీపీ, జగన్ అభిమానులు టీఆర్ఎస్ పై, మంత్రి కెటీఆర్ పై విమర్శల దాడి ప్రారంభించారు. ఇది అంతిమంగా తెలంగాణలో టీఆర్ఎస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పలు సందర్భాల్లో సీఎం కెసీఆర్ తోపాటు తెలంగాణ మంత్రులు కూడా ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, విద్యుత్ , పారిశ్రామిక అంశాలను ప్రస్తావిస్తూ తమను విమర్శించిన వారే గోతిలో పడ్డారంటూ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.