అప్పట్లో చందాబాబూ...ఇప్పుడు యేసు బాబు

Update: 2021-03-20 11:24 GMT

ఏపీ బిజెపి ఫేస్ బుక్ పేజీలో జగన్ పై వివాదస్పద వ్యాఖ్యలు

ఏపీ బిజెపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తన అధికారిక పేస్ బుక్ పేజీలో వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని నరేంద్రమోడీ పథకాలకు తమ స్టిక్కర్లు తగిలించుకుంటున్నారని విమర్శించింది. దీనికి సంబంధించిన వివరాలు పెడుతూ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'అప్పట్లో చందాబాబూ-ఇప్పుడు యేసు బాబు, మోడీ పథకాలపై సొంత స్టిక్కర్లు అంటూ పోస్టు పెట్టారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమానికి వైఎస్సార్ రైతు భరోసా అని, పీఎం స్వనిధి పథకానికి జగనన్న తోడు, అయుష్మాన్ భారత్ కు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, పీఎం జీవన్ జ్యోతి పథకానికి వైఎస్సార్ బీమా అని, పీఎం మత్స సంపద పథకానికి వైఎస్సార్ మత్సకార నేస్తం అని, ఉజాల పథకానికి జగనన్న పల్లె వెలుగు, ఉజ్వల పథకానికి దీపం పథకం అని పేరు పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని బిజెపి ఈ ప్రచారం ప్రారంభించినట్లు కన్పిస్తోంది.

Tags:    

Similar News