సోషల్ మీడియాలో ట్రోలింగ్
ఒక్కో సారి ఎంత పెద్ద కంపెనీ అయినా అలా 'బుక్' అవుతుంటాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సంస్థ శాంసంగ్ అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. తాజాగా మార్కెట్లోకి విడుదల అవుతున్న శాంసంగ్ గెలాక్సీ21 స్మార్ట్ ఫోన్ గురించి చెప్పటానికి 'శాంసంగ్ మొబైల్స్ యూఎస్' ట్విట్టర్ ఖాతా నుంచి ఓ ట్వీట్ చేశారు. త్వరలోనే ఎంతో ఆసక్తిరేపే వార్త చెప్పబోతున్నామని వెల్లడించింది.
అంతే కాదు..ఏ విభాగంలో మీరు విన్నూత, మరింత మెరుగైన అంశాలను కోరుకుంటున్నారు అంటూ కెమెరా, డిజైన్, ఎకో సిస్టమ్, పనితీరు వంటి అంశాలను ప్రస్తవించారు. అది కూడా యాపిల్ ఐఫోన్ నుంచి. అంతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. చివరకు శాంసంగ్ ఉద్యోగులు కూడా ఆ కంపెనీ ఫోన్లు వాడరు అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. మరో యూజర్ ఏ ఫోన్ బాగా పనిచేస్తుందో వాళ్లకు తెలుసు అంటూ కామెంట్ చేశారు.