జూబ్లిహిల్స్ స్కామ్.. పెద్ద‌ల రంగ ప్ర‌వేశంతోమారిన సీన్?!

Update: 2021-06-08 07:25 GMT

మాకేమీ కాదంటున్న స్కామ్ స్ట‌ర్లు?

ఒక్క‌సారిగా క‌థ మారిపోయింది. ఏమి జ‌రిగింది? ఈ కేసులోకి రంగ ప్ర‌వేశం చేసిన వారెవ‌రు?. సొసైటీని అడ్డం పెట్టుకుని వంద‌ల కోట్ల రూపాయ‌లు అక్ర‌మంగా సంపాదించిన వారు ఇప్పుడు ఇక మాకు ఏమీ కాదు అని ఎందుకంత ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఓ ప్ర‌ముఖ వ్య‌క్తి రంగంలోకి అది ఎప్పుడో పాత కేసు...ప‌ట్టించుకోకండి..వ‌దిలేయండి అని చెప్పేశార‌ని..దీంతో ఇక త‌మ‌కు అంతా నిశ్చింతే అని ఆ స్కామ్ స్ట‌ర్లు పండ‌గ చేసుకుంటున్నారు. అంతే కాదు.. ఈవిష‌యాన్ని త‌మ అస్మ‌దీయుల‌కు చెబుతూ ఫుల్ కుషీకుషీగా గ‌డుపుతున్నారు. వాళ్లు చెప్పిన‌ట్లే ప‌రిణామాలు కూడా అదే దిశ‌గా సాగుతున్నాయి. ఇప్ప‌టికే న‌మోదు అయిన కేసులో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ కేసు ఓ శాంపిల్ మాత్ర‌మే అని.. ముందుంది అస‌లు ముస‌ళ్ళ పండ‌గ అంటూ ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే వీటికి సంబంధించిన ప‌త్రాలుఅన్నీ రెడీ చేసి పెట్టారు. ఇవి కూడా త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రాబోతున్నాయి. అవి వ‌స్తే సినిమా మ‌రింత రంజుగా మార‌టం ఖాయంగా క‌న్పిస్తోంది. మ‌రి వాటికి కూడా ఈ ముఖ్య నేత‌లు అడ్డం ప‌డ‌తారా? అస‌లు అవినీతిని ఏ మాత్రం స‌హించం అని పైకి ప్ర‌క‌ట‌న‌లు చేసే నేత‌లు త‌మ వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి మాత్రం అన్ని మిన‌హాయింపులు ఇచ్చేస్తారా?. అంటే ఎవ‌రికి దోరికింది వారు దోచుకుని..ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటే చాల‌న్న మాట‌.

ఈ ప‌రిణామాలు చూస్తుంటే అలాగే అన్పిస్తోంది. ప‌రిశ్ర‌మ‌లు..ప్ర‌భుత్వాలు. క్విడ్ ప్రోకో ఉదంతాలు గ‌తంలో ఎన్నో జ‌రిగాయి. రాజ‌కీయ నేత‌లు అధికారులు క‌లిస్తే ఇక వాళ్ల‌కు తిరుగే ఉండ‌దు. ఇప్పుడు మీడియా...ప్ర‌భుత్వ ప్ర‌ముఖులు. ఇది కొత్త ట్రెండ్ కాక‌పోయినా అలా సాగుతూ పోతుంది. నా శ‌త్రువును నేను చెప్పిన‌ట్లు నువు టార్గెట్ చెయ్. నీ శ‌త్రువు నుంచి నేను కాపాడుతా. ఇలా సాగుతున్నాయి ఒప్పందాలు అని జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ స‌ర్కిల్స్ లోబ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ తెర‌చాటు ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫ‌లితాన్ని ఇస్తాయి?. కోర్టులు కూడా వీటినిచూస్తూ ఊరుకుంటాయా? లేక కొర‌డా ఝ‌ళిపిస్తాయా అన్న‌ది తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News