కలకలం రేపుతున్న ఈనాడు లేఖ
ఆంధ్ర జ్యోతి కి సర్కారు ఇవ్వదు..మీ యాడ్స్ మాకొద్దు అంటున్న ఈనాడు..మిగిలింది సాక్షి ఒక్కటే
తెలుగు పత్రికల్లో సర్కులేషన్ పరంగా ఈనాడు పేపర్ నంబర్ వన్. మిగిలిన పత్రికలతో పోలిస్తే సహజంగా ఈనాడు లో ప్రకటన ఇవ్వాలన్నా కూడా అదే స్థాయిలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పత్రికలకు ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలే. ప్రభుత్వ యాడ్స్ తో పాటు ప్రైవేట్, కార్పొరేట్ యాడ్స్ పత్రికల ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తాయి. . ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటే ఈనాడు పేపర్ ఆంధ్ర ప్రదేశ్ లో సంచలన నిర్ణయం తీసుకుంది. అది ఏంటి అంటే వైసీపీ సర్కారు నుంచి ఆ పత్రిక ప్రకటనలు వేయరాదు అన్నదే ఈ నిర్ణయం. దీనివల్ల ఈనాడు సంస్థ ఏకంగా ఏడాదిలో దగ్గర దగ్గర 50 నుంచి 60 కోట్ల రూపాయల మేర నష్టపోయే అవకాశం ఉంది అని అధికార వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా జగన్ సర్కారు మార్గదర్శి పై పెద్ద ఎత్తున కేసు లు పెట్టడటంతో పాటు ఎప్పటిలాగానే సీఎం జగన్ తన ప్రతి సమావేశంలో ఈనాడు పత్రికను...ఆ సంస్థ చైర్మన్ రామోజీరావు ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య ఈనాడు తమకు యాడ్స్ వద్దు అని అధికారికంగా లేఖ ఇవ్వటం పెద్ద సంచలనంగా మారింది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోవటానికి కూడా ఈనాడు రెడీ అయింది అంటే దీని వెనక బలమైన కారణాలు ఉంది ఉంటాయనే చర్చ సాగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరో ప్రధాన పత్రిక ఆంధ్ర జ్యోతి కి అసలు యాడ్స్ ఇవ్వటమే మానేశారు. ఇప్పుడు ఈనాడు ఏకంగా మీ యాడ్స్ మాకు వద్దు అంటూ లేఖ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో తెలుగులో ఉన్నది మూడే ప్రధాన పత్రికలు. ఈనాడు, ఆంధ్ర జ్యోతి, సాక్షి. ఇందులో ఒక పేపర్ ఆంధ్ర జ్యోతికి సర్కారే యాడ్స్ ఇవ్వదు...మరో పత్రిక మీ యాడ్స్ మాకు వద్దు అని చెప్పేసింది. ఇక మిగిలింది సీఎం జగన్ ఫ్యామిలీ పేపర్ సాక్షి. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి సాక్షి గ్రూప్ కు యాడ్స్ పెద్ద ఎత్తున ఇస్తూ సర్కారు తన అభిమానాన్ని చాటుకుంటోంది. ఒకప్పుడు చంద్రబాబు ప్రచారంపై విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు అంతకు మించి సర్కారు ఖజానాతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. జగన్ సర్కారు ఈ నాలుగేళ్లలో ఇచ్చినన్ని జాకెట్ యాడ్స్ బహుశా ఎవరూ ఇచ్చి ఉండరు అని అధికార వర్గాలు కూడా చెపుతున్నాయి.