అదానీ చెప్పే వరకు భారత్ పై దాడి అని కేంద్రానికి తెలియదా?!

Update: 2023-01-30 05:20 GMT

*అదానీ గ్రూప్ చెపుతున్నట్లు హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ భారత్ పై దాడి అయితే ఇంత వరకు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు.

*భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలి ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలు నష్ట పోయినా కేంద్రం మౌనం వెనక కారణం ఏమిటి?

#ఒక రీసెర్చ్ సంస్థ దేశ ఆర్థిక వ్యవస్థ లో అత్యంత కీలకమైన అదానీ గ్రూపుపై రెండేళ్లపాటు స్టడీ చేసి నివేదిక ఇచ్చాం అని చెప్పినా కేంద్ర ఆర్థిక మంత్రి మౌనంపై అనుమానాలు ఎన్నో ?

#హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికను తప్పుబడితే అదానీ ని ప్రధాని మోడీ వెనకేసుకు వస్తున్నారు అని అనే విమర్శలు వస్తాయని భయపడ్డారా?. లేక నివేదికలో నిజం ఉంది అని నమ్ముతున్నారా?

#అదానీ గ్రూప్ తమపై వచ్చిన ఆరోపణల నుంచి బయట పడేందుకు జాతీయవాదం ముసుగుతో బయటకు వచ్చిందా.

#తొలిసారి వివరణలో లేని భారత్ పై దాడి ..రెండవసారి వచ్చిందే అంటే ఇది వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారా?

#దేశం లో ఇన్ని బడా బడా గ్రూపులు ఉండగా ఒక్క అదానిపైనే హిండెన్ బర్గ్ కు కోపం ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది.

#అతి తక్కువ సమయంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన అదానీ.

#నివేదిక అంతా తప్పు తప్పు అంటున్న అదానీ తాజా వివరణలో న్యాయపరమైన చర్యలు అంశాన్ని విస్మరించిందా?. మేము దైనికైనా రెడీ అని హిండెన్ బర్గ్ రీసెర్చ్ విసిరినా సవాల్ తో వెనక్కి తగ్గారా.

తాజాగా అదానీ స్పందన చుసిన తర్వాత వస్తున్నా పలు అనుమానాలు. దేశ కార్పొరేట్ చరిత్రలో బహుశా ఏ కంపెనీ కూడా తన గ్రూప్ పై వచ్చిన కార్పొరేట్ మోసాలు. స్టాక్ మానిప్యులేషన్, పన్ను ఎగవేత వంటి అంశాలను భారత్ పై దాడి వంటి పెద్ద పెద్ద పదాలు వాడిన దాఖలాలు లేవు. కానీ అదానీ గ్రూప్ మాత్రం ఇప్పుడు అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక పై మాత్రం ఇదే తరహా స్పందన వెలిబుచ్చింది. ఇది ఒక కంపెనీ పై దాడి కాదు అని...భారత్, భారతీయ సంస్థలు సాధిస్తున్న ప్రగతిపై దాడిగా అభివర్ణించింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికపై మరో సారి 413 పేజీల్లో తన కౌంటర్ ఇచ్చింది. హిండెన్ బర్గ్ నివేదిక పూర్తిగా తప్పు, అందులోని అంశాలు అన్ని అసత్యాలు అంటూ పేర్కొంది.

                                       మార్కెట్ లో తప్పుడు ప్రచారం చేసి లబ్ది పొందాలనే దురుద్దేశంతోనే ఈ షార్ట్ సెల్లింగ్ కంపెనీ ఇలాంటి నివేదికను బహిర్గతం చేసింది అని ఆరోపించింది. ఈ రీసెర్చ్ సంస్థ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు అదానీ గ్రూప్ కంపెనీలు ఇప్పటికే వెల్లడించాయని తన వివరణలో అదానీ గ్రూప్ వెల్లడించింది. అయితే అదానీ గ్రూప్ వివరణపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ కూడా స్పందించింది. జాతీయవాదం పేరు చెప్పి అస్పష్ట సమాధానాలతో తప్పించుకోలేరు అని కౌంటర్ ఇచ్చింది. తాము లేవనెత్తిన ప్రతి కీలక ఆరోపణకు సరైన సమాదానాలు రాలేదని స్పష్టం చేసింది. ఈ సారి అదానీ గ్రూప్ న్యాయపరమైన చర్యల అంశాన్ని ప్రస్తావించినట్లు లేదు. అదానీ గ్రూప్ చెపుతున్నట్లు ఇది భారత్ పై దాడి అయితే ఇంత వారుకు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు.

Tags:    

Similar News