పోసాని కృష్ణ మురళి అటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల క్రితం అయితే పవన్ కళ్యాణ్ పై మరీ వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో దూషణలు చేశారు. ఇది అప్పట్లో పెద్ద దుమారపే రేపింది. సహజంగా చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఆ రేంజ్ లో తిట్టడమే అర్హతగా ఆయనకు పదవి ఖాయం అయిపోయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే ఇంతకు మించి అర్హత ఏమి ఉంటుందని ఓ నాయుకుడు వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా వేగవంతం చేసి జిల్లాల వారీగా నియమాకాలు చేపట్టింది. ఇప్పుడు ఆలీ, పోసాని కృష్ణ మురళి ని కూడా ప్రభుత్వంలోకి తీసుకుని వీరి సేవలను పార్టీకి ఉపయోగించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రచారంలో విషయంలో తాము చాలా పూర్ అని చెప్పుకునే వైసీపీ సర్కారు ప్రభుత్వ ప్రకటనలు..ప్రచారం విషయంలో చంద్రబాబును మించిపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.