భారత్‌లో అమెరికా రాయబారి అయిన సెర్గియో గోర్ (Sergio Gor), తెలంగాణలోని హైదరాబాద్‌లో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్ఎంఏఎల్) ప్లాంటును సందర్శించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో భారత్‌తో పారిశ్రామిక సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై గల ఉమ్మడి నిబద్ధతకు ఈ పర్యటన నిదర్శనంగా నిలుస్తుంది. ఇటీవల ఆవిష్కరించిన మీడియం ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అవసరాలను తీర్చేందుకు ఇరు పక్షాలు కృషి చేస్తూ, భారత ఏరోస్పేస్, డిఫెన్స్ వ్యవస్థలో పురోగమించే కొద్దీ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మరియు లాక్‌హీడ్ మార్టిన్ మధ్య ఇప్పటికే నిరూపితమైన భాగస్వామ్యం మరింత పటిష్టమవుతూ, కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఈ పర్యటన సందర్భంగా సీ-130జె సూపర్ హెర్క్యులిస్‌ కోసం ఎంపెనేజ్‌లను తయారు చేసే ప్రొడక్షన్ లైన్‌ని రాయబారి సందర్శించారు. ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ఎయిర్‌లిఫ్టర్‌కి తోడ్పాటునివ్వడంలో భారతీయ పరిశ్రమ పోషిస్తున్న కీలకపాత్రకు హైదరాబాద్ ప్లాంటు నిదర్శనంగా నిలుస్తోంది. ఎంటీఏ పోటీ అవసరాలను తీర్చే విధంగా తయారు చేయడంలోనూ, తయారీని విస్తరించడంలోను విశిష్ట సామర్థ్యాలను ఈ జాయింట్ వెంచర్ ప్రతిబింబిస్తుంది.

                                లాక్‌హీడ్ మార్టిన్ మరియు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యం మరియు భారత రక్షణ రంగ ఆధునీకరణ మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలకు మద్దతుగా భారత్‌లో అధునాతన ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాలను విస్తృతం చేయడంపై ఇరు సంస్థలకు గల ఉమ్మడి నిబద్ధతకు ఈ సందర్శన నిదర్శనంగా నిల్చింది. “వినూత్న ఆవిష్కరణలు, భద్రతపై ఉమ్మడి ఆసక్తి, ఆర్థిక సహకారం ద్వారా అమెరికా మరియు భారత్ మధ్య దశాబ్దాలుగా ఉన్న వ్యాపార భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతోంది,” అని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. “ఇరు దేశాలు నిర్వహించే ప్లాట్‌ఫాం సీ-130జేకి సంబంధించిన కీలక భాగాలు భారత్‌లో తయారు కావడమనేది, అమెరికా మరియు భారత్ మధ్య పటిష్టమవుతున్న పారిశ్రామిక మరియు రక్షణ రంగ సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇలాంటి భాగస్వామ్యాలనేవి విశిష్ట నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల కల్పనకు, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేసేందుకు, ఇండో-పసిఫిక్‌ను స్వేచ్ఛగా, సురక్షితంగా మార్చాలనే ఉమ్మడి ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడతాయి,” అని పేర్కొన్నారు.

                                                      “సీ-130జేలాంటి కీలక కార్యక్రమాలు సహా లాక్‌హీడ్ మార్టిన్‌కి అవసరమైన ప్రపంచ స్థాయి ఏరోస్ట్రక్చర్స్‌ని అందించడంలో ఆ సంస్థతో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కి గల భాగస్వామ్యం అనేక సంవత్సరాలుగా సమర్ధవంతంగా పనిచేస్తోంది. ఇప్పుడు ఈ భాగస్వామ్యం త్వరలోనే అమల్లోకి రాబోయే ఎంఆర్‌వో (MRO)కి కూడా విస్తరించబడింది. అలాగే, అవకాశం లభిస్తే మేక్ ఇన్ ఇండియాకి సంబంధించిన పూర్తి స్థాయి ప్లాట్‌ఫాంలపై కూడా కసరత్తు చేసేలా పరస్పర సహకారాన్ని ఇరు పక్షాలు పెంపొందించుకుంటున్నాయి. MoDకి తోడ్పాటు అందించేలా రెండు సంస్థలు తమ ప్రపంచ స్థాయి సామర్థ్యాలను వినియోగంలోకి తీసుకొస్తాయి,” అని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుకరణ్ సింగ్ (Sukaran Singh) తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ యొక్క ఎంఆర్‌వోను ప్రారంభించే ప్రణాళికలు ఉన్నాయి. 2027 వసంత కాలంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ల రాక ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. “భారత పరిశ్రమతో జట్టు కట్టడం ద్వారా సీ-130జే ఆపరేటర్ల గ్లోబల్ నెట్‌వర్క్‌కి నేరుగా సేవలందించే విధంగా మేము ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాలను నిర్మించాం,” అని ఎయిర్ మొబిలిటీ అండ్ మారిటైమ్ మిషన్స్ వైస్ ప్రెసిడెంట్ త్రిష్ పేగన్ (Trish Pagan) తెలిపారు.

                                         “భారత ఏరోస్పేస్ ఆకాంక్షల సాకారానికి, అలాగే అంతర్జాతీయంగా నిరూపితమైన సొల్యూషన్స్‌ను అందిస్తూనే దేశీయంగా అధునాతన తయారీ, టెక్నాలజీ మరియు ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించే అవకాశాలను పరిశీలించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. మిగతావారు అనుకరించేందుకు ప్రయత్నిస్తుండగా, మేము మాత్రం దశాబ్దాలుగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ, సుస్పష్టమైన మా సామర్థ్యాలను నిరూపించి, చూపిస్తున్నాం,” అని వివరించారు. 20 మిషన్స్‌ (missions) వ్యాప్తంగా సర్టిఫై చేయబడిన సీ-130జే సూపర్ హెర్క్యులిస్ ప్రపంచవ్యాప్తంగా మిలిటరీలకు సేవలందిస్తోంది. వ్యూహాత్మక ఎయిర్‌లిఫ్టింగ్ కార్యకలాపాలు, మానవీయ సహాయాలు, విపత్తుల సందర్భంగా సేవలు, మరియు స్పెషల్ మిషన్ కార్యకలాపాలకు మూలస్తంభంగా నిలుస్తోంది. సీ-130జే ఎంపెనేజ్‌ల ఉత్పత్తి ద్వారా భారత్ ఈ ప్రోగ్రాంలో పాలుపంచుకోవడమనేది గ్లోబల్ ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థలో భారత పరిశ్రమ అనుసంధానం కావడాన్ని మరియు అమెరికా-భారత్ మధ్య డిఫెన్స్ రంగంలో భాగస్వామ్యం మరింత బలోపేతం కావడాన్ని సూచిస్తోంది. “మా ఈ జాయింట్ వెంచర్‌లో మేము 15 ఏళ్లకు పైగా గణనీయంగా ఇన్వెస్ట్ చేశాం. ఇప్పటికే నిరూపితమైన సహకారం, సామర్థ్యాలను ఈ మీడియం ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ భాగస్వామ్య అవకాశం మరింత బలోపేతం చేస్తుంది. తదుపరి అవకాశాలపై మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం,” అని పేగన్ (Pagan) తెలిపారు.

Tags: