తెలుగు న్యూస్ చానెల్స్ లో టీవీ 9 తిరిగి తన నంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. అక్కడితో ఆగలేదు ఈ ఛానల్. ఇంత కాలం మోసం చేసి..దగా చేసి కొంత మంది నంబర్ వన్ గా నిలిచారంటూ ఎదురుదాడికి దిగింది. దీనికి సంబంధించి ఒక చిన్న పాటి వీడియో ను విడుదల చేసింది. ఇది ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. టీవీ 9 ఎటాక్ ఇలా ఉంది. ‘మోసం తో ఎన్ని రోజులు నంబర్ వన్ గా నటిస్తారు. ప్రేక్షకులు అమాయకులు అనుకుంటున్నారా?.దగా చేసి నంబర్ వన్ కావాలంటే జనం తిరగపడతారు. దగాపరులను ఎండగడతారు. నంబర్ వన్ కావటం కోసం కుట్రలు చేస్తే జనం పాతరేస్తారు. సత్యంతోనే జన హృదయాలను గెలుచుకోవాలి.
నిజాయతీగా నంబర్ వన్ స్థానాన్ని సాధించుకోవాలి. టీవీ 9 . సత్యమేవ జయతే. ప్రజా ప్రయోజనార్థం జారీ చేయటం అయింది.’ అంటూ వీడియో విడుదల చేసింది. ఛానల్ రేటింగ్స్ విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయి. చాలా రోజుల పాటు బార్క్ ఏకంగా రేటింగ్స్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ముంబైలో కూడా దీనికి సంబంధించి పెద్ద రచ్చ నడిచింది. తర్వాత మళ్ళీ అంతా సద్దుమణిగింది. ఇప్పుడు టీవీ 9 మోసం, కుట్ర, దగా అంటూ డైరెక్ట్ ఎటాక్ కు దిగటం హాట్ టాపిక్ గా మారింది.