అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత కొన్ని రోజులు డ్రగ్స్ అంశానికి సంబంధించి కెటీఆర్ వర్సెస్ రేవంత్ ల మధ్య హాట్ హాట్ గా ట్వీట్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు రేవంత్ పై ఎటాక్ చేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ రేవంత్ పదే పదే కేటీఆర్ పై నిరాధారమైన ఆరోపణలు చేసి అబసు పాలు అవుతున్నారన్నారు. మీ పార్టీ అధిష్టానానికి నీమీద నమ్మకముంటే కేటీఆర్ రాహుల్ గాంధీ మీద విసిరిన సవాల్ ను స్వీకరించామను. లేదంటే పీసీసీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ ఆర్టీఐ చట్టాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. సమాజంలో లాంగగానో, దొంగగానో గుర్తింపు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేయడం మానుకోవాలని హెచ్చరించారు.
మరో ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ చీటర్ కమిటీ అధ్యక్షుడు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. నువ్వు కెటీఆర్ నను ఎంట్రుకతో సమానం అంటే మేము బొచ్చుతో సమానం అంటామన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల రక్త నమూనాలను టెస్టు చేయాలని, రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వ నాశనం అవుతుందిదని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ క్యాడర్ లేని పార్టీకి క్యారెక్టర్ లేని లీడర్ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే నువ్వు బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ అంబాసిడర్ వి అని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. మాకు తెలిసిన వైట్ వేరు..దొంగలకు పెద్ద రేవంత్ కు తెలిసిన వైట్ వేరు అన్నారు. ముందు రాహుల్ గాంధీని పబ్ లకు వెళ్లకుండా ఆపాలని సూచించారు...