రాష్ట్రంలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు. అన్ని షాప్ లు, ఆఫీసులు, ఎస్టాబిష్ మెంట్స్ కరోనా నిబంధనలు పాటిస్తూ ఓపెన్ చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, కాలేజీలు జులై1 నుంచి రీఓపెన్ చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.