కరోనా లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15 వరకూ వీటిని సెలవులను పొడిగించారు. అంతకు ముందు మే 31 వరకే సెలవులు అని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 9 వరకూ పొడిగించిన విషయం తెలిసిందే.