అధికార టీఆర్ఎస్ కు షాక్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. గతకొంతగా ఆ పార్టీ నాయకత్వ తీరుతో తీవ్రంగా విభేదిస్తున్న మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ గౌడ్ సోమవారం రాజీనామా సమర్పించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన ప్రవీణ్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ నేతలతో విభేదించిన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో వరుస ఓటములను ఎదుర్కొంటున్న అధికార టీఆర్ఎస్ కు రాజకీయంగా ప్రస్తుతం ఒకింత గడ్డు పరిస్థితిని ఎధుర్కొంటోంది.