బండి సంజయ్ పై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Update: 2022-12-20 12:55 GMT

చెప్పుతో కొడతా...కాదు కాదు..అయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి.

తెలంగాణ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంచలన వ్యాఖలు చేశారు. దేశం అంతా ఏమి జరుగుతోందో చూస్తున్నాము కదా..రాజకీయంగా ఎదుర్కోవటం చేతకాక వేట కుక్కలను వదులుతున్నారు. మోడీ, కేడి, ఈడీ వచ్చి ఏమి చేయలేరు.. గతంలోనే ఈ మాట చెప్పామన్నారు. మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ కెటిఆర్ బీజేపీ పై తీవ్ర స్థాయిలో స్పందించారు. '.ఇదేమి చిల్లర రాజకీయం.ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడారా సన్నాసి అంటే ఫాల్తూ మాటలు...తెల్లారి లెగిస్తే మొరుగుడు, విచిత్ర జంతువుల్లా విచిత్ర అరుపులు వీళ్ళు మనుషులా..వీళ్ళు నాయకులా ఏమైనా. డ్రగ్స్ ఏందీ..టెస్ట్ ఏందీ. ఇస్తా. ఇచ్చాక చెప్పు తీసుకుని కొడతా పడతాడా. నేను చిత్త శుద్ధిగా బయటకు వస్తా.కరీంనగర్ చౌరస్తా లో చెప్పు దెబ్బలు తింటాడా నాతోని అన్నోడు. సరే నేను ఒక్కటే అడుగుతున్నా.

                                        డ్రగ్స్ కాదు..నా రక్తం తీస్తారా.చర్మం తీసుకుపోతారా ఏమి తీసుకుపోతారో తీసుకుపొమ్మను.నా బొచ్చు కోవాలంటే..బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్త శుద్దితో వచ్చాక...కరీంనగర్ చౌరస్తాలో కమాన్ దగ్గర చెప్పు దెబ్బలు తింటాడా. నా చెప్పు కాదు..నా చెప్పు కాదు..మళ్ళీ అట్ల అంటే అవమాన పర్చారు..ఇంకేదో తొక్కలో రాగాలు తీస్తారు. అయన చెప్పుతో అయన కొట్టుకుంటాడా. దీనికి సిద్ధం అయితే చెప్పు ఏ డాక్టర్ ను తీసుకొస్తాడో...ఏ గుండు కొట్టే ఆయన్ను తీసుకొస్తాడో రమ్మను. నా బొచ్చు ఇస్తా...రక్తం ఇస్తా..గోళ్లు ఇస్తా..వాడి బొంద ఏమి కావాలంటే అది ఇస్తా. నా కిడ్నీ కావాలంటే కిడ్నీ కూడా ఇస్తా. ...వాడి పిండాకూడు. ఏమి రాజకీయం ఇది. వాడికి ఏమైనా తెలివి ఉందా అసలు.మనీషా ..పశువా. ఏమి చేసావురా భాయ్ కరీంనగర్ కు అంటే చెప్పే మొఖం లేదు అంటూ ఫైర్ అయ్యారు కె టి ఆర్.



Tags:    

Similar News