అభివృద్దిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పురుషులతో నేడు అన్ని రంగాల్లో పోటీపడుతూ మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారన్నారు. జనాభాలో సగం గా వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూయిస్తారని సిఎం తెలిపారు. వారిని అభివృద్ది పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమంలో ముందంజలో వున్నదని సిఎం కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8, 2021 న రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సిఎం ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సీఎస్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.