తెలంగాణ హెల్త్ డైరక్టర్ గడల శ్రీనివాసరావు వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఖమ్మంలో నిర్వహించిన పూజలు వివాదస్పదం అయ్యాయి. పూనకం వచ్చిన ఓ మహిళా ఎంపీపీ చుట్టూ తిరుగుతూ ఆయన ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వీడియోలు మీడియాలో ప్రసారం అయ్యాయి. తనకు తాను దేవతగా ప్రకటించుకున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి చుట్టూ ఆయన ఇలా భక్తితో తిరగటం దుమారం రేపుతోంది. హెల్త్ డైరక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మూడ నమ్మకాలను ప్రోత్సహించేలా పూజల్లో పాల్గొనటం కలకలం రేపుతోంది. అంతే కాదు అక్కడ నిర్వహించిన హోమంలో కూడా ఆయన మిరపకాయలు విసిరేశారు. పూజలు అనంతరం ఆమె పక్కనే కూర్చుని ఆమె చెబుతున్న విషయాలను అత్యంత భక్తిప్రపత్తులతో వింటున్న చిత్రాలు కూడా వచ్చాయి.