శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్రాయినికి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

Update: 2022-03-11 08:34 GMT

హైదరాబాద్ లోని జీఎంఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2021 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) అవార్డును సాధించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో, 15-25 మిలియన్ ప్యాసింజర్స్ (MPPA) విభాగంలో 'బెస్ట్ ఎయిర్ పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్'గా ఎంపికైంది. ASQ సర్వే ద్వారా ప్రపంచంలోని ప్రముఖ విమానాశ్రయ ప్రయాణీకుల సేవలు, విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకుల సంతృప్తిని, అందించే సర్వీసులను పరిశీలిస్తారు. జీహెచ్ ఏఐఎల్ సీఈఓ ప్రదీప్ పణికర్ ఈ అవార్డుపై మాట్లాడుతూ, "ACI నిర్వహించే వార్షిక ASQ సర్వేలో ప్రతి ఏడాదీ ప్రయాణీకులు మమ్మల్ని ఉత్తమ విమానాశ్రయంగా ఎన్నుకోవడం త‌మ‌కు దక్కిన గౌరవం అన్నారు.

కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి మేం ప్రయాణికుల కోసం విమానాశ్రయంలో అనేక కస్టమర్ ఫ్రెండ్లీ కార్యక్రమాలను చేపట్టి, విమాన ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి కృషి చేసాం. ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన మా భాగస్వాములందరికీ మా కృతజ్ఞతలు. మా కార్యక్రమాలన్నిటిలోనూ అంతర్గతంగా 'ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్' అనే మా లక్ష్యం కనిపిస్తుంది" అన్నారు. ACI వరల్డ్ డైరెక్టర్ జనరల్ శ్రీ లూయిస్ ఫెలిప్ డి ఒలివెరా, "జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ అవార్డు దక్కడం ప్రయాణికులకు మెరుగైన అనుభవం ఇవ్వడానికి వారు చేస్తున్న కృషికి నిదర్శనం. నేటి పరిస్థితులలో విమానాశ్రయాలన్నీ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి చేస్తున్న కృషికి ఈ అవార్డులు నిదర్శనం." అన్నారు.

Tags:    

Similar News