ఈనాడు పేపర్ వచ్చింది అంటే ముందు ఆ పత్రికలో వచ్చిన వార్తల కంటే అందరూ శ్రీధర్ కార్టూన్ నే తొలుత చూసేవారు. అంత పాపులర్ ఆయన కార్టూన్లు. కార్టూనిస్ట్ శ్రీధర్ ను, ఈనాడు. విడదీసి చూడటం కష్టం. శ్రీధర్ కార్టూన్ లేని ఈనాడును ఊహించటం కూడా కష్టమే. అసలు తెలుగు రాష్ట్రాల్లో పత్రికల గురించి తెలిసిన వారెవరికైనా శ్రీధర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అంతగా పాపులర్ అయిన కార్టూనిస్టు తెలుగు రాష్ట్రాల్లో మరొకరు లేరు అని చెప్పొచ్చు.
అలా అంటే ఇతర కార్టూనిస్టులను అవమానించినట్లు కాదు కానీ...శ్రీధర్ కార్టూన్లు క్లిక్ అయినంతగా మరేమీ కాలేదనే చెప్పాలి. అందుకు శ్రీధర్ ఈనాడులో ఉండటం కూడా ఓ కారణం కావొచ్చు. కానీ కార్టూనిస్టుల్లో శ్రీధర్ తనదైన ముద్ర వేశారు. ఇటీవలే ఆయన ఈనాడులో 40 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్నారు. తాజాగా తయన ఈనాడుకు రాజీనామా చేసి వైదొలగినట్లు తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ఇది శ్రీధర్ కార్టూన్లను ప్రేమించివారికి షాకింగ్ న్యూసే.