తప్పుడు ప్రచారంపై పరువు నష్టం దావా వేస్తా

Update: 2021-01-05 05:35 GMT

తెలంగాణ అగ్రోస్ మాజీ ఛైర్మన్ లింగంపల్లి కిషన్ రెడ్డిపై తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొంత మంది నాపై కుట్ర చేసి జనవరి 1 తేది న తెలంగాణ భవన్ కు సరోజన అనే మహిళ ను పంపించి పై అసత్య ఆరోపణలు చేశారు. సరోజ మాట్లాడిన ప్రతి మాటపూర్తి గా అర్ధ రహితం. తెలంగాణ ఉద్యమంలో లో కేసీఆర్ తో నేను 2001 నుంచి క్రమశిక్షణ కల కార్యకర్త గా పనిచేస్తున్నా.నర్సక్కపల్లి లో ఇండ్లు కట్టించిన మంచినీళ్ల బావికి సొంత భూమిని ఇచ్చిన.నేను చేసిన పనికి నాకు కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశమే ఇచ్చారు .

కేసీఆర్.తెలంగాణ ఉద్యమకారులు 40 ట్రాక్టర్ లను ఎక్కడ అవినీతికి పాల్పడకుండా పిలిచి ఇచ్చాను. డబ్బు ప్రాధాన్యత కోసం నేను రాజకీయాలకు రాలేదు.తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి నడిచిన.నాకు పడని వాళ్ళు నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.నా అమ్మానాన్నలను ఎంత ప్రేమిస్తానో తెలంగాణ భవన్ ను అంతే ప్రేమిస్తా. కేసీఆర్ కేటీఆర్ దగ్గర మంచి పేరు ఉందనే నాపై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నాపై చేస్తున్న దుష్ప్రచారం పై పరువు నష్టం దావా వేస్తా.' అని హెచ్చరించారు.

Tags:    

Similar News