తెలంగాణ సర్కారు కీలక మార్పులు చేసింది. గత కొన్నిసంవత్సరాలుగా సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న వీ సీ సజ్జనార్ ను అక్కడ నుంచి బదిలీ చేసింది. ఆయన్ను టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమించారు. సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గా తనదైన మార్క్ చూపించారు. ఆయన 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్.
ఇటీవలే ఆయన అడిషనల్ డీజీ ర్యాంకు ప్రమోషన్ పొందారు. వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంటర్, శంషాబాద్ దిశ ఎన్ కౌంటర్‌లు సజ్జనార్‌ను దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా చేశాయి. మల్టీ లెవెల్ స్కాములను ఛేదించడంలో సజ్జనార్‌కు మంచి పేరుంది. కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్‌లో విశేష సేవలు అందించారు.