నగర ప్రజలు, పర్యాటకులకు కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది. మీర్ అలం ట్యాంక్, జూ పార్కు సమీపంలో మల్టీ మీడియా మ్యూజికల్ ఫౌంటేన్ సిద్ధం అయింది. 2.55 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టారు. పాత బస్తీ ప్రజలతోపాటు జూపార్కును సందర్శించే పర్యాటకుల కోసం దీన్ని డెవలప్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఫౌంటేన్లు పాటలకు అనుగుణంగా నర్తిస్తాయి. ఇవి పర్యాటకులను నూతన అనుభూతిని కల్పించనున్నాయి. కంప్యూటర్ అనుసంధానిత మ్యూజిక్ సిస్టమ్ తో ఇవి పనిచేయనున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం రెండు సార్లు ఈ షోలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ పనులు పూర్తి కావటంతో త్వరలోనే ఫౌంటేన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.