తెలంగాణ భాష పెడితేనే హీరోలు స‌క్సెస్ అవుతున్న‌రు

Update: 2022-03-09 04:50 GMT

తెలంగాణ సీఎం కెసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు సినిమాల్లో తెలంగాణ భాష పెడితేనే హీరో స‌క్సెస్ అవుతున్న‌డు అని వ్యాఖ్యానించారు. గ‌తంలో జోక‌ర్ల‌కు, విల‌న్ల‌కు ఈ భాష పెట్టేవాళ్ళు అన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ‌ భాష‌, సంస్కృతిని ఎప్పుడు ప‌ట్టించుకోలేద‌న్నారు.

ఎన్నో పండ‌గ‌లు ఇప్పుడు అధికారికంగా జ‌రుపుకుంటున్నాం అన్నారు. రాజ‌కీయాలు అంటే త‌మ‌కు మిగిలిన పార్టీల త‌ర‌హాలో గేమ్ కాద‌ని..ఇది త‌మ‌కు ఓ టాస్క్ అని వ్యాఖ్యానించారు. త‌న‌పై వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేసినా..ఏనుగు పోతుంటే కుక్క‌లు మొరుగుతుంటాయ‌ని వ‌దిలేసిన‌ట్లు వ్యాఖ్యానించారు. త‌మ ల‌క్ష్యం దెబ్బ‌తిన‌కూడ‌ద‌నే ఇలాంటి మాట‌లు ప‌ట్టించుకోలేద‌న్నారు. 

Tags:    

Similar News