
ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. గత కొన్ని రోజులుగా వివాదస్పదంగా మారిన అంశంపై టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పారు. దీనికి సంబంధించి ఆయన ఓ ఛానల్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను భువనేశ్వరిపై పొరపాటున వ్యాఖ్యలు చేశాను. చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నా. ఎమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవం.
నా వ్యాఖ్యలకు నేను బాధపడుతున్నా. టీడీపీలో నాకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి. భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా. కులం నుంచి వెలివేస్తారనే భయంతో క్షమాపణ చెప్పలేదు.. నేను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నా' అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రకటించారు.