ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి పీసీసీ మార్పు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. తాజాగా ఆయన ఓ లేఖను ఏఐసీసీకి పంపించారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ తన లేఖలో పేర్కొన్నారు. గతంలోనే తాను ఏఐసీసీకి లేఖ రాశానని, ఆమోదించాలని కోరారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి అనంతరం ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు కేవలం 2 డివిజన్లలో(ఉప్పల్, ఏఎస్ రావు నగర్) మాత్రమే విజయం దక్కింది.