తెలంగాణ నూతన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పార్టీ నాయకులు..కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ కార్యాలయానికి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, మల్లురవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్ , బెల్లయ్యనాయక్‌లు రేవంత్ ను కలసి అభినందనలు తెలిపారు. వీరీతోపాటు రేవంత్ రెడ్డిని మేడ్చల్, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి, కరీంనగర్, పెద్ద పల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా కలిశారు. నూతన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి మందకృష్ణమాదిగ ఫోన్‌లో అభినందనలు తెలియజేశారు.