తెలంగాణ నూతన పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బాధ్యత స్వీకరణ కార్యక్రమం కోసం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలివచ్చారు. నగరంలో రేవంత్ అనుచరుల హంగామా కన్పించింది. భారీ ర్యాలీతో అభిమానుల కోలాహలం మధ్య రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు బయలుదేరారు. తొలుత ఆయన పెద్దమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. తర్వాత నాంపల్లిలోని దర్గాకు ర్యాలీగా బయలుదేరి వెళ్ళారు.
రేవంత్ కు పదవి ఇవ్వటంతో కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు రాజుకుంటాయని ప్రచారం జరిగింది. కానీ ఒకరిద్దరు తప్ప..పెద్దగా ఎవరూ నోరు విప్పలేదు. రేవంత్ కూడా సీనియర్ నేతలు అందరినీ వ్యక్తిగతంగా ఇళ్ళకు వెళ్ళి కలసి భవిష్యత్ లో తాము అంతా కలసి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటామని..సొంత నిర్ణయాలు ఏమీ ఉండవంటూ ప్రకటించి అందరినీ కలుపుకుని పోతాననే సంకేతాలు ఇచ్చారు.