మారుతున్న రాహుల్ ఇమేజ్

Update: 2023-08-19 10:49 GMT

Full Viewకాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తన ఇమేజ్ మార్చుకునే పనిలో ఉన్నారు. గతంతో పోలిస్తే ఆయనకు సోషల్ మీడియా లో ఆదరణ కూడా గణనీయంగా పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా భారత్ జోడో యాత్రతో తనలో ఎంతో మార్పు వచ్చింది అని కూడా రాహుల్ గాంధీ చెపుతున్న విషయం తెలిసిందే. వివిధ వర్గాల ప్రజలకు కనెక్ట్ అయ్యేందుకు అయన రక రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక రకంగా ప్రజలతో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ ఢిల్లీ లో కూరగాయలు అమ్మే వ్యక్తి రామేశ్వర్, అయన భార్య తో కలిసి తన నివాసం లో లంచ్ చేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ ని రామేశ్వర్ సర్ సర్ అని సంబోదించగా ..సర్ అని వద్దు అంటూ రాహుల్ అని పిలవాలని సూచించారు.

దీనికి సంబందించిన వీడియో కూడా బయటకు వచ్చింది. తాజగా మరో సారి రాహుల్ గాంధీ లేహ్ పర్యటన ఫోటో లో సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగాంగ్ సరస్సుకు అయన బైక్ రైడ్ తో వెళ్లారు. రాహుల్ తో పాటు కొంత మంది టీం ఉన్నట్లు ఆ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. ఈ ఫోటో లను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయగా..అవి వైరల్ అయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో పాంగాంగ్ సర్సాస్సు ఒకటి అని..దీని గురించి తన తండ్రి రాజీవ్ గాంధీ చెప్పారు అని మీడియా తో మాట్లాడుతూ వెల్లడించారు. పాంగాంగ్ టూరిస్ట్ క్యాంపు లోనే రాహుల్ గాంధీ శనివారం రాత్రికి బస చేస్తారు అని చెపుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించనున్నారు. 

Tags:    

Similar News