కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై సాగుతున్న ఈడీ విచారణపై కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ పరిణామాలపై బిజెపి మండిపడింది. విచారణల నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని..ఈ దేశంలో ఎవరూ యువరాజు కాదు..క్వీన్ విక్టోరియా కాదు అంటూ బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు. అవినీతి చేసిన వారెవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనన్నారు. ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవన్నారు. దేశంలో అవినీతి జరిగితే రాజ్యాంగం ప్రకారం విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఓ కుటంబం..రాహుల్ పాత్ర గురించి దేశం అంతటికి తెలుసని వ్యాఖ్యానించారు.