తెలంగాణ కోసం పదవులు వదులుకుంది టీఆర్ఎస్
తెలంగాణను ఆంధ్రోళ్లకు వదిలేసింది కాంగ్రెస్
నాకు సీఎం పదవి తెలంగాణ ప్రజల బిక్ష
జానారెడ్డి వల్ల అయితే..ఆయనే తీసుకునేవాడుగా
నాగార్జున సాగర్ లో భగత్ గాలివీస్తోంది.
'జానారెడ్డి వల్ల నాకు సీఎం పదవి వచ్చిందని కొంత మంది మాట్లాడుతున్నారు. నాకు సీఎం పదవి ఇప్పించే పరిస్థితే జానారెడ్డికి ఉంటే ఆయన తీసుకుంటడు. నాకిప్పస్తడా?. నాకు సీఎం పదవి తెలంగాణ ప్రజలు పెట్టిన బిక్ష. మరెవరూ కాదు. తెలంగాణ ను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రోళ్లకు వదిలేసింది. టీఆర్ఎస్ తెలంగాణ కోసం ఎన్నోసార్లు పదవులు వదిలేసింది. పదవుల కోసం కాంగ్రెస్ నాయకులే లొంగి..ఒంగి ఉన్నారు. ' అని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. కెసీఆర్ బుధవారం నాడు నాగార్జునసాగర్ ఎన్నికల ప్రచారంలో బాగంగా అనుమలలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అధికారం కోసం లొంగి..ఒంగి ఉన్నారని ఎద్దవా చేశారు. కాంగ్రెస్ నాయకులు సక్కగా ఉంటే తెలంగాణలో ఎందుకు గులాబీ జెండా ఎగిరింది. ఎగరాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గడ్డిపోచల్లా పదవులు వదిలేశామననారు. ఎన్ని రాజీనామాలు చేశాం. ఎన్నిక ఉప ఎన్నికలు కొట్లాడినం. ఇది మీ కళ్ల ముందు జరిగింది. అంతా చరిత్ర. అన్నీ చూసుకుని ఓటు వేయాలి. నోముల భగత్ గాలి బాగుందని తెలుస్తోంది. జానారెడ్డి నందికొండకు ఏమి చేశారు. జానారెడ్డి 30 ఏళ్ళ కాలంలో డిగ్రీ కాలేజ్ కూడా రాలేదు. రైతులు చనిపోతే ఐదు లక్ష రూపాయలు బ్యాంక్ లో పడుతున్నాయి.
కాంగ్రెస్ ఉంటే ఇది వచ్చేదా?. ఏ పైరవి లేదు..ఎవరి దగ్గరకి పోవాల్సిన అవసరం లేకుండా అన్నీ అందుతున్నాయి. ఎట్టి పరిస్థిత్లుల్లోనూ సభ జరగనీయవద్దని కొంత మంది ప్రయత్నం చేశారు. ఇది ఏ మాత్రం సరికాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు. ప్రధాని మోడీతోపాటు నాయకులు అందరూ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకున్నారు. ఎవరి వాదనలు వారు చెప్పి ఓట్లు అడగటం తప్పేమీకాదు. నెల్లికల్లు లిఫ్ట్ ను పూర్తి చేస్తాం. వరి సాగులో తెలంగాణ ప్రథమ స్థానం లో ఉంది. తలసరి ఆదాయం పెరిగింది. తలసిరి విద్యుత్ వినియోగం పెరిగింది. మంచి చేసే వాళ్లను గెలిపిస్తే చాలా మంది జరుగుతుంది. గులాబీ జెండా పుట్టక ముందు తెలంగాణ ఓ అనాథ లా ఉండేది. అడిగివాళ్లు లేరు. మాట్లాడేవాళ్లు లేరు. దీనికి బాధ్యత ఎవరు కాంగ్రెస్ వాళ్లు కాదా? అని ప్రశ్నించారు.