కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ముఖ్యమంత్రి అయిన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సమావేశంలో భావోద్వేగంతో మాట్లాడారు. రెండేళ్లు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపానని తెలిపారు. ఈ మాటలు మాట్లాడే సమయంలో ఆయన ముఖంలో ఆందోళన స్పష్టంగా కన్పించింది. తనకు 75 సంవత్సరాల వయస్సులో అవకాశం ఇచ్చిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.
మధ్యాహ్నం తర్వాత యడ్యూరప్ప రాజానామా లేఖను గవర్నర్ కు సమర్పించే అవకాశం ఉంది. తన రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. యడ్యూరప్ప రాజీనామా ఖరారు కావటంతో ఇక తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్న చర్చ ప్రారంభం అయింది. ప్రహ్లాద్ జోషి పేరు ముందు వరసలో ఉంది. మరి అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేస్తుందో వేచిచూడాల్సిందే.