బండి సంజయ్ కారుపై దాడి

Update: 2020-11-30 17:02 GMT

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై దాడి జరిగింది. ఈ వ్యవహారం కలకలం రేపింది. సోమవారం రాత్రి నెక్లెస్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఒక హోటల్‌కు వచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. ఆయనతో ఎక్కువ మంది ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. సంజయ్‌ కారును టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో బండి సంజయ్‌ను పోలీసులు వేరే కారులో పంపారు.

తన డివిజన్ లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సంజయ్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధి విజయారెడ్డి అక్కడకు చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. సంజయ్ వాహనాలను తనిఖీ చేయాలని విజయారెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో బండి సంజయ్ వాహనం అద్దాలు పగిలిపోయాయి. చివరకు పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Tags:    

Similar News