తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం

Update: 2024-02-02 10:34 GMT

సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావటం దక్షిణాదికి కొత్తేమి కాదు. సినిమా రంగం నుంచి వచ్చి సంచలన విజయాలు అందుకున్న వాళ్ళు ఎంత మందో. కొంత మంది ఎదురుదెబ్బలు తిన్నవాళ్ళు కూడా ఉన్నారు. తమిళ్ నాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత ఇమేజ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. ఆయన్ను అక్కడ దళపతి అని కూడా పిలుస్తారు. విజయ్ రాజకీయాల్లో వస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. దీనిపై చాలా సార్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ సారి మాత్రం అధికారికంగా విజయ్ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో గత కొంత కాలంగా ఉన్న సస్పెన్స్ కు తెరపడినట్లు అయింది. తమిళిగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీ ని ఏర్పాటు చేశారు. అయితే తమ పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయదు అని...అదే సమయంలో ఎవరికీ మద్దదు ఇవ్వదు అన్నారు. తమిళ్ నాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటూ విజయ్ వ్యాఖ్యానించటం విశేషం.

అంతే కాదు ప్రస్తుతం తమిళ నాడులో అవినీతి పాలన సాగుతోంది....దానికి వ్యతిరేకంగా పోరాడేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. 2026 లో తమిళ నాడు అసెంబ్లీ కి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తమిళ నాడు లో డీఎంకె ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ఇప్పుడు బలంగా ఉంది. జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకె లో రకరకాల వివాదాలు...పార్టీ కూడా బలహీన పడుతూ వస్తోంది. ఈ తరుణంలో విజయ్ కొత్త పార్టీ ఏఐఏడీఎంకె ఓటు బ్యాంకు ను కొల్లగొడుతుందా..లేక డీఎంకె ను కూడా దెబ్బ తెస్తుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. గత కొన్ని రోజులుగా విజయ్ తన అభిమాన సంఘాల నాయకులతో సమావేశం అవుతూ వస్తున్నారు. ఇప్పుడు ఊహాగానాలను నిజం చేస్తూ పార్టీ ప్రకటన నిజం చేశారు. విజయ్ తమిళ హీరో అయినా టాలీవుడ్ లోను అయనకు మంచి మార్కెట్ ఉంది. అందుకే విజయ్ చేసిన సినిమాలు అన్ని ఇక్కడ కూడా విడుదల అవుతాయని విషయం తెలిసిందే.

Tags:    

Similar News