మహా...వేడి

Update: 2023-02-19 11:54 GMT

Full Viewమహారాష్ట్ర రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. దీనికి ప్రధాన కారణం కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పేరు, గుర్తు అయినా విల్లు, బాణం ను సీఎం ఏకనాథ్ షిండే వర్గానికి కేటాయించటం. ప్రస్తుతం దీనిపైనే హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. సిఈసి నిర్ణయం వెలువడిన మరుసటి రోజు ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట నిలబెట్టుకున్నారు అని చెప్పటం ఆసక్తి కరంగా మారింది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి...మీ వెనక రాయిలాగా గట్టిగా నిలబడతామన్నారు..ఏమి చెప్పారో అదే చేశారు అని ప్రకటించారు. సిఈసి నిర్ణయం వెలువడిన తర్వాత షిండే ఈ కామెంట్స్ చేయటంతో ఇది పెద్ద చర్చనీయాంశగా మారింది. శివసేన నుంచి చీలిపోయిన ఈ గ్రూప్ బీజేపీ తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఏకనాథ్ షిండే కామెంట్స్ ఇలా ఉంటే..ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ కు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పేరు, విల్లు బాణం గుర్తు షిండే గ్రూప్ కు దక్కటం వెనక 2000 కోట్ల రూపాయల డీల్ జరిగింది అని ప్రకటించారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే అన్నారు. ఇది పక్క సమాచారం అని..దీనికి సంబంధించి త్వరలో వివరాలు బయటకు వస్తాయన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు అన్నారు. అయితే ఈ ఆరోపణలను షిండే వర్గం తోసిపుచ్చింది. ఒక వైపు అమిత్ షా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని సీఎం చెపుతుంటే....మరో వైపు సంజయ్ రౌత్ ఆరోపణలు రాజకీయ వేడి రాజేశాయి.

Tags:    

Similar News