Full Viewఅందరూ చూసే ఫుల్ పేజీ ప్రభుత్వ ప్రకటనలో మాత్రం వైసీపీ, సీఎం జగన్ అధికారంలోకి రావటానికి కారణం అయిన దివంగత వైఎస్ఆర్ ఫోటో మాత్రం ఎక్కడా కన్పించదు. అవసరమైన వారు మాత్రమే చూసే వైఎస్ఆర్ పెళ్లి కానుక వెబ్ సైట్ లో మాత్రం సీఎం జగన్ తోపాటు వైఎస్ఆర్ ఫోటో కూడా పెట్టారు. మరి అదే స్కీమ్..అదే యాడ్ ఫుల్ పేజీ..అదీ జాకెట్ యాడ్. తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో ఇచ్చినప్పుడు మాత్రం వైఎస్ఆర్ ఫోటో కనీసం చిన్నది కూడా పెట్టకపోవటం అన్నది ఇప్పుడు వైసీపీలో కూడా తీవ్ర చర్చనీయాంంగా మారింది. వైఎస్ఆర్ పెళ్లికానుక., వైఎస్ఆర్ షాదీ తోఫా ల పేరుతో అక్టోబర్ 1న పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. పేర్లు మాత్రం వైఎస్ఆర్ వే ఉన్నా..ఆ యాడ్ లో మాత్రం ఎక్కడా వైఎస్ఆర్ ఫోటో లేకుండా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక యాడ్స్ లో ఒక్క సీఎం జగన్ ఫోటో తప్ప..మంత్రుల ఫోటోలకూ ఛాన్స్ లేకుండా చేశారు. వైఎస్ఆర్ పేరుతో ఉన్న స్కీమ్ లకు మాత్రం తొలుత ఆయన ఫోటోలు కూడా పెట్టేవారు. ఇప్పుడు మాత్రం పేరు ఆయనదే అయినా వైఎస్ఆర్ ఫోటోలు మాత్రం లేకుండా చేస్తున్నారు. ఓ వైపు సీఎం జగన్ దగ్గర నుంచి వైసీపీ మంత్రులు అందరూ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబుపై విమర్శలు చేస్తూ..ఇప్పుడు వైఎస్ఆర్ పోటోలు ఆయన పేరుతో ఉన్న స్కీమ్ ల్లో కూడా లేకుండా కేవలం ఒక్క జగన్ ఫోటోలు మాత్రమే పెట్టుకోవటంపై వైసీపీ నేతలు కూడా షాక్ కు గురవుతున్నారు.
ఇది ప్రజలకు తప్పుడు సంకేతం పంపుతుందని..సీఎం జగన్ స్వయంగా తన తండ్రి ఫోటోలు లేని యాడ్స్ ఇవ్వటం..అది కూడా ఆయన పేరుతో ఉన్న వాటికి దివంగత నేత ఫోటో పెట్టకపోవటం అన్నది సరికాదనే చర్చ సాగుతోంది. మరో వైపు నవరత్నాల లోగోలో కూడా తొలుత వైఎస్ఆర్, జగన్ ఫోటోలు ఉండేవి. ఇప్పుడు వైఎస్ఆర్ ఫోటో తీసేసి కేవలం ఒక్క సీఎం జగన్ ఫోటో మాత్రమే వేస్తున్నారు. స్వయంగా సీఎం జగన్ ఫ్యామిలీకి చెందిన పత్రికలోనూ కేవలం ఒక్క జగన్ తో కూడిన నవరత్నాల స్కీమ్ ఫోటోను మాత్రమే తాజాగా ప్రచురించారు కూడా. ఇవన్నీ చూస్తుంటే సీఎం జగన్ కూడా వైఎస్ఆర్ పేరు బదులు తన పథకాలు..తన ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నట్లు కన్పిస్తోందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే ఆయన పేరుతో ఉన్న స్కీమ్ లకు కూడా ఆయన ఫోటో పెట్టకుండా చేయటం అంటే ఇది కీలక పరిణామంగా అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ మామ. కానీ సీఎం జగన్ దగ్గరకు వచ్చేసరికి వైఎస్ఆర్ స్వయంగా తండ్రి. మరి ఓ వైపు వెబ్ సైట్ లో మాత్రం వైఎస్ఆర్ ఫోటోలు పెట్టి..జాకెట్ యాడ్స్ లో మాత్రం ఆయన ఫోటోలు తీసేయటం దేనికి సంకేతం అన్న చర్చ సాగుతోంది.