రుణాలపై మారటోరియం పొడిగించటం కుదరదు

Update: 2020-10-10 15:36 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) సుప్రీంకోర్టుకు రుణాల మారటోరియంపై తన వైఖరిని స్పష్టం చేసింది. ఆరు నెలలకు మించి రుణాలపై మారటోరియం పొడిగించటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. మారటోరియాన్ని మరింత కాలం పొడిగించటం వల్ల చాలా సమస్యలు వస్తాయని, చెల్లింపులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో పేర్కొంది. కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో చక్రవడ్డీ తప్ప మరేమీ మాఫీ చేయలేమని తేల్చిచెప్పింది.

అంటే మారటోరియం కాలానికి సంబంధించిన వడ్డీపై వడ్డీ వసూలు చేయరన్నమాట. ఆర్ధిక విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని కేంద్రం పేర్కొంది. కరోనాతో ఆదాయం కోల్పోయిన వివిధ రంగాల వారికి మారటోరియంతో ఊరట కల్పించామని, రుణగ్రహీతలకు చక్రవడ్డీ మాఫీ చేశామని ..ఇంత కంటే ఎక్కువ ఉప శమనాలు సాధ్యం కాదని తెలిపారు. మారటోరియం కాలానికి పూర్తిగా వడ్డీ మాఫీ చేయాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Similar News