ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకటించిన తెలంగాణ సర్కారు

Update: 2020-09-01 09:03 GMT

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమోదం లేని..అక్రమ లేఔట్లను క్రమబద్దీకరించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామపంచాయతీల దగ్గర నుంచి పట్టణ ప్రాంతాలకూ ఇది వర్తించనుంది. తెలంగాణ అంతటా వర్తించేలా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాట్ లతోపాటు లే ఔట్లకు సంబంధించి సంబంధిత అధికారికి అక్టోబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కామన్ వెబ్ పోర్టల్, మీ సేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ కేంద్రాలు, క్రమబద్దీకరణ కోసం సిద్ధం చేసిన మొబైల్ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆగస్టు 26 లోపు చేసిన లే అవుట్ ఓనర్లకు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి మున్సిపల్‌ శాఖ కొన్ని నిబంధనల్నిప్రకటించింది.

నాలాకు 2 మీటర్ల దూరం ఉండాలి.

వాగుకు 9 మీటర్ల దూరం ఉండాలి.

10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి .

10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లో ఉన్న చెరువుకు 30 మీటర్ల దూరం ఉండాలి.

ఎయిర్‌పోర్టు, డిఫెన్స్ స్థలానికి 500 మీటర్ల దూరం ఉండాలి.

వ్యక్తిగత ప్లాట్ ఓనర్స్ వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, లే అవుట్ ఓనర్స్ 10 వేలు

రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. 100 గజాల లోపు ఉన్న వారు గజానికి 200 రూపాయల చొప్పున చెల్లించాలి. 101 నుంచి 300 గజాలు ఉన్నవాళ్లు గజానికి 400 రూపాయలు చెల్లించాలి. 301 నుంచి 500 గజాలు ఉన్నవాళ్లు గజానికి 600 రూపాయలు చెల్లించాలి.

 

Similar News