క్రీడా బెట్టింగ్ ను చట్టబద్దం చేయాలి

Update: 2020-09-08 04:16 GMT

భారత్ లో స్పోర్ట్స్ బెట్టింగ్ ను చట్టబద్దం చేయాలని రిటైర్డ్ జస్టిస్ ముకుల్ ముద్గల్ సూచించారు. దీనిపై నిర్ణయం తీసుకోవటం ప్రభుత్వానికి చాలా పెద్ద సవాల్ తో కూడిన వ్యవహారమే అని వ్యాఖ్యానించారు. అయితే ఇది క్రీడలకు, ప్రజలకు..ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అయితే బెట్టింగ్ ను నియంత్రించేందుకు గేమింగ్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై విచారణ జరిపిన కమిటీకి ఆయన నేతృత్వం వహించారు.

ప్రస్తుతం భారత్ లో బెట్టింగ్ పై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయినా సరే దేశంలో క్రీడలకు సంబంధించి కోట్లాది రూపాయల గ్యాంబ్లింగ్ జరుగుతుంది. ఈ బెట్టింగ్ లో పెద్ద ఎత్తున బ్లాక్ మనీ వస్తోందని..అదే సమయంలో ఇది అండర్ వరల్డ్ గ్యాంగ్ లకు వెళుతున్నాయని పేర్కొన్నారు. క్రీడా సంఘాల వ్యవహారాలు కూడా అనుమానాస్పదంగా మారాయని ముద్గల్ వ్యాఖ్యనించారు.తాజాగా ఆయన ఓ క్రీడా జర్నలిస్టుతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Similar News