‘స్వర’ శిఖరం మూగబోయింది

Update: 2020-09-25 08:50 GMT

ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ ఆయన పాటలు ప్రజల మనసస్ల్లో బాలును చిరస్మరణీయుడిగా ఉంచుతాయి. ఆ అమృత కంఠంలో కరోనా పురుగు చేరటంతో ఆయన ఆగస్టు 5న చెన్నయ్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. చేరినప్పుడు చాలా హుషారుగానే ఉన్నారు. ఫోన్ల తాకిడి తట్టుకోలేక ఓ వీడియో విడుదల చేసి త్వరలోనే కోలుకుని బయటకు వస్తానని సందేశమిచ్చారు. కానీ చెప్పినట్లు బయటకు రాకుండానే దివికేగారు. తెలుగుతో పాటు పలు బారతీయ భాషల్లో తన పాటలతో ఊర్రూతలూగించిన బాలసుబ్రమణ్యం శుక్రవారం మధ్యాహ్నాం 1.04 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. బాలు 1.04 నిమిషాలకు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్‌ మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు.

ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజుల తర్వాత వెంటిలేట‌ర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయ‌న కోలుకుని బయటకు రావాలని కోట్లాది ఆయన అభిమానులు ఆకాక్షించారు. కానీ వారి పూజలు ఫలించలేదు. ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీప‌తి పండితారాధ్యుల బాలసుబ్ర‌హ్మ‌ణ్యం.. 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేట‌మ్మ పేట గ్రామంలో బ్రాహ్మ‌ణ కుటుంబంలో జ‌న్మించారు. ఈయ‌న‌ సాంబ‌మూర్తి, శ‌కుంత‌ల‌మ్మ దంప‌తుల రెండో సంతానం. ఇంజ‌నీర్ కావాల‌ని క‌ల‌లు క‌ని గాయ‌కుడయ్యారు. సావిత్రిని వివాహం చేసుకున్నారు.

Similar News