టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ కు తమిళ నాడు కు చెందిన వేల్స్ యూనివర్సిటీ శనివారం నాడు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. అట్టహాసంగా జరిగిన యూనివర్శిటీ స్నాతకోత్సవంలో రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ కార్యక్రమం లో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు. కళా రంగానికి రామ్ చరణ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. డాక్టరేట్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ మాట్లాడుతూ తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించిన యూనివర్సిటి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.