చైతన్య రావు కు హిట్ దక్కిందా?!(Paarijatha Parvam Movie)

Update: 2024-04-19 09:41 GMT

ఒక్కో సారి చిన్న సినిమా లు సర్ప్రైజ్ ఇస్తుంటాయి. ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంటాయి. అయితే అన్ని చిన్న సినిమాలు విజయం సాధిస్తాయని నమ్మితే కూడా ఇబ్బందే. ఒక వైపు ఐపీఎల్, మరో వైపు ఎన్నికల వాతావరణం, పరీక్షల టెన్షన్ ను దృష్టిలో పెట్టుకుని పెద్ద సినిమాలు కాస్త బ్రేక్ తీసుకుంటే...ఈ బ్రేక్ లో చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అందులో భాగంగా శుక్రవారం నాడు వచ్చిందే పారిజాత పర్వం మూవీ. ఇందులో హీరో గా ఉన్న Full Viewచైతన్య రావు కు హిట్ దక్కిందా?! ఇటీవలే కీడా కోలా సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వైవా హర్ష, సునీల్ లు, శ్రద్దా దాస్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

                                              పారిజాత పర్వం సినిమా కు ఉప శీర్షికగా కిడ్నాప్ కూడా కళే అని పెట్టారు. దీంతో సినిమా కిడ్నాప్ చుట్టూనే తిరగనున్నట్లు స్పష్టం అయింది. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే పారిజాత పర్వం సినిమాలో అన్నీ సినిమా కథలే. ఒకరు దర్శకుడు కావాలి అని..మరొకరు హీరో కావాలని చేసే ప్రయత్నాలు..అందులో ఎదురయ్యే సవాళ్ల చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. తమకు ఎదురవుతున్న అవమానాలను ఎదుర్కొని ఎలాగైనా సరే తాము అనుకున్న సినిమా కల నెరవేర్చుకునేందుకు ఈ సారి ఒక ప్రముఖ నిర్మాత భార్య ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. మరి ఈ కిడ్నాప్ ప్లాన్ సక్సెస్ అయిందా...వాళ్ళ సినిమా కల నెరవేరిందా అన్నదే సినిమా.

                                               అయితే ఏ దశలో ఈ సినిమాలో ప్రేక్షకులు పెద్దగా ఎంటర్టైన్ అయ్యే అంశాలు కనిపించవు అనే చెప్పాలి. కథలో...కథనంలో కూడా ఏ మాత్రం కొత్తదనం కనిపించవు. శ్రద్దా దాస్ ఒక బార్ లో డాన్స్ గర్ల్ గా కనిపిస్తుంది. హీరో చైతన్య రావు తన పాత్రకు న్యాయం చేసినా కూడా ఎక్కడా నటనకు స్కోప్ కు లేదు అనే చెప్పాలి. సునీల్, వైవా హర్ష ల పాత్రల పరిస్థితి కూడా అంతే. ఈ సినిమాలో ఒక ప్రముఖ నిర్మాత గా కనిపించిన శ్రీకాంత్ అయ్యంగార్ నటనలో కొత్తదనం చూపించారు. దర్శకుడు సంతోష్ కంభంపాటి ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన సినిమా కష్టాలు, కిడ్నాప్ డ్రామాలను అత్యంత సాదాసీదాగా చూపించారు ఇందులో. దీంతో పారిజాత పర్వం సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్షగా చెప్పుకోవాలి.

                                                                                                                                                                                                             రేటింగ్ : 2 /5 

Tags:    

Similar News