చంద్రబాబుపై పెండింగ్ కేసులనూ త్వరగా విచారించాలి

Update: 2020-09-18 13:09 GMT

ఏపీ రాజకీయాలు అన్నీ కేసుల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతిపక్షం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులు గురించి ప్రస్తావిస్తుంటే...అధికార పార్టీ చంద్రబాబు కేసుల గురించి ప్రస్తావిస్తోంది. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చంద్రబాబు పెండింగ్ కేసుల అంశాన్ని లేవనెతారు. ఆయన శుక్రవారం నాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తారని ఆరోపణలున్నాయి. బాబు అక్రమాస్తుల కేసు పెండింగ్‌లో ఉంది. 2005 నుంచి ఈ కేసు అలాగే ఉంది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఈ కేసు వేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారు.

ఈ కేసును కూడా త్వరితగతిన విచారణ జరపాల్సి ఉంది’’అని అంబటి వ్యాఖ్యానించారు. అమరావతిలో జరిగింది చాలా పెద్ద కుంభకోణం. నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌, వారి అనుచరులకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇప్పుడు జ్యూడీషియరీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, న్యాయం త్వరితగతిన జరగడం లేదనే భావన ఉందన్నారు. రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరించడం సబబు కాదని పేర్కొన్నారు.

Similar News