చంద్రబాబు ‘రికార్డు’ను బ్రేక్ చేసే దిశగా పవన్ కళ్యాణ్

Update: 2020-09-10 05:31 GMT

అనతికాలంలోనే ‘ఘనత’కెక్కుతున్న జనసేనాని

జనసేనాని త్వరలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రికార్డును బ్రేక్ చేసేలా ఉన్నారు. నలభై ఏళ్ళ తర్వాత చంద్రబాబు ఈ స్టేజ్ కు చేరుకుంటే పదేళ్ళలోనే పవన్ కళ్యాణ్ ఈ ఘనత సాధించటానికి చేరువలో ఉన్నారు. మాటలు మార్చటంలో..ఆయన చంద్రబాబును స్పూర్తిగా తీసుకున్నట్లు కన్పిస్తోంది. ‘హిందూ దేవాలయాలకు సంబంధించి కానీ..హిందూ మతానికి సంబంధించి కానీ మాట్లాడాలి అంటే మనల్ని మతవాదులు అనేస్తారు అన్న ఒక భావజాలాన్ని ప్రవేశపెట్టారు. ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.’ ఇదీ అంతర్వేది ఘటనపై పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఓ సుదీర్ఘ ప్రకటనలో ఓ భాగం. కానీ ఇదే పవన్ కళ్యాణ్ హిందులపై చేసిన వ్యాఖ్యలు చూడండి.

‘ఎంతో మంది విదేశాలకు వెళ్లి..గల్ఫ్ లకు వెళ్ళి అన్నా మన దేశం బాగుంటుంది అని చెప్పింది ఎవరు. హిందువులు కాదు..ముస్లింలు. వాళ్ల మనసు అంతా ఇక్కడే ఉంటుంది. కొంత మంది నాయకులు ఈ విషయంతో ఆటలాడతారు. అందులో ఎక్కువగా హిందూ నాయకులే. ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప ఎవరూ కాదు. మిగతా నాయకులు అసలు ఇలాంటి పనులు చేయరు. ఓట్ల కోసం గొడవలు చేస్తున్నది హిందూ నాయకులు. హిందూ నాయుకుల ప్రోద్భలం లేకుండా ఇవి జరగవు. సెక్యులరిజం సెక్యులరిజం అని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు. మిగతా వాళ్ళు చేయలేదు. ’ ఇవి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. అంతే కాదు..క్రిష్టియన్లతో సమావేశం సందర్భంగా ఆవేశంగా ఊగిపోతూ ‘నా బిడ్డలు ఇద్దరు హిందూ మతం పాటిస్తే ఇద్దరు క్రిష్టియన్ మతం పాటిస్తారు.నా సన్నిహితులు అందరూ ఇస్లాంను పాటిస్తారు.

ఇవీ పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు. ఏపీకి ప్రత్యేక హోదా దగ్గర నుంచి అమరావతి విషయం వరకూ పవన్ కళ్యాణ్ లో ఎన్నో వేరియేషన్లు..ఎంతో మంది కన్పిస్తూ ఉంటారు. 2014 ఎన్నికల్లోనూ బిజెపితో పొత్తు ఉన్నా..అప్పుడు పవన్ కళ్యాణ్ లో కాషాయీకరణ అంతగా జరిగినట్లు లేదు. కానీ ఈ సారి పొత్తులో మాత్రం కాషాయీకీరణ బలంగా జరుగుతున్నట్లు కన్పిస్తోంది. అంతర్వేది ఘటనకు సంబంధించిన అంశంపై పవన్ కళ్యాణ్ ప్రకటన చూస్తే ఈ విషయం అర్ధం అయిపోతుంది. ఏ మతానికి చెందిన ప్రార్ధనామందిరాలపై దాడులు సమ్మతం కాదు. కానీ పవన్ కళ్యాణ్ స్పందనలో ‘వేరియేషన్స్’ మాత్రం ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నాయి.

Similar News