రిలయన్స్ రిటైల్ లో జనరల్ అట్లాంటిక్ కు వాటా

Update: 2020-09-30 04:57 GMT

సేమ్ టూ సేమ్. రిలయన్స్ జియో మోడల్ నే రిలయన్స్ రిటైల్ లోనూ ఫాలో అవుతున్నారు. జియో ఫ్లాట్ ఫామ్స్ లో ఎలా అయితే వాటాల అమ్మటం ద్వారా లక్ష కోట్ల రూపాయలకుపైగా సాధించిన ముఖేష్ అంబానీ కంపెనీ ఇప్పుడు రిటైల్ విషయంలోనూ అలాగే ముందుకెళుతోంది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్ లో రెండు కంపెనీలు వాటాలు కొనుగోలు చేయగా..తాజాగా మూడో డీల్ జరిగింది. విశేషం ఏమిటంటే ఈ మూడు సంస్థలూ గతంలో రిలయన్స్ జియో ఫ్లాట్ ఫామ్స్ లో పెట్టుబడులు పెట్టినవే కావటం మరో విశేషం.

పీఈ దిగ్గజం జనరల్‌ అట్లాంటిక్‌ పార్టనర్స్‌ రిలయన్స్ రిటైల్ లో 0.84 శాతం వాటా కొనుగోలు చేయనుంది. దీని కోసం కంపెనీ 3675 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే రిలయన్స్‌ రిటైల్‌లో పీఈ దిగ్గజాలు సిల్వర్‌ లేక్‌ పార్టనర్స్‌, కేకేఆర్‌ అండ్‌ కో వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సిల్వర్‌ లేక్‌ 1.75 శాతం వాటాను సొంతం చేసుకోగా.. కేకేఆర్‌ 1.28 శాతం వాటాను కైవసం చేసుకుంది.

Similar News