రెండు లక్షలు దాటిన అమెరికా కరోనా మరణాలు

Update: 2020-09-23 14:30 GMT

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య ఏకంగా రెండు లక్షలు దాటేసింది. మొత్తం కేసులు డెబ్బయి లక్షలకు చేరువలోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు అంటోనీ పౌచీ హెచ్చరించారు. అమెరికాలో తొలి కరోనా కేసు నమోదు అయి ఇప్పటికే ఎనిమిది నెలలు దాటింది. అయినా సరే కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.

వ్యాక్సిన్ వస్తే తప్ప..ఇది నియంత్రణలోకి రాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే వ్యాక్సిన్ పై కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా కరోనా వ్యవహారం అత్యంత కీలకంగా మారనుంది. అమెరికాలో కరోనా ఉధృతి ఇదే రీతిగా కొనసాగితే కొత్త సంవత్సరం నాటికి మరణాల సంఖ్య నాలుగు లక్షలకు చేరువ అయ్యే అవకాశం ఉందని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Similar News