ఆంధ్రప్రదేశ్ ను అమెరికాలా చేస్తాం

Update: 2020-08-04 14:40 GMT

ఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అమెరికాగా మార్చటమే తమ లక్ష్యం అన్నారు. దీనికి సంబంధించి తమ దగ్గర స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. 2024లో రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తేవటమే తమ టార్గెట్ అని వెల్లడించారు. ఈ దిశగా తాము అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి కూడా తమ దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. రాయలసీమ రతనాల సీమ అని..అక్కడ ఎన్నో వనరులు ఉన్నాయని..అక్కడ ఉన్న గనులను చంద్రబాబు హయాంలో ఎవరు తవ్వుకున్నారో..ఇప్పుడు ఎవరు తవ్వుకుంటున్నారో అందరికీ తెలుసన్నారు. తాము అధికారంలోకి వస్తే రాయలసీమలోని ఖనిజ నిక్షేపాలను ప్రజలకే చెందుతాయని ప్రకటించారు. సోము వీర్రాజు ఓ ఛానల్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతం ఉందని..అక్కడ కొత్త ఓడరేవులు నిర్మిస్తే అభివృద్ధి అదే జరగుతుందని అన్నారు. ఏపీలో తమకు ఆ రెండు పార్టీలు ఒకటే అని వైసీపీ, టీడీపీల నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఒకాయన అమరావతిలో భవనాలు కడతానంటే..మరోకాయన వైజాగ్ లో భవనాలు కడతానని చెబుతున్నారని..కానీ తమ దగ్గర ఏపీ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళిక ఉందని..ఏమి చేయాలో తమకు తెలుసన్నారు. ఎవరి ప్రయోజనాలో దెబ్బతింటాయని గత ప్రభుత్వ హయాంలో ఓడరేవులు అక్కడ వద్దు..ఇక్కడ వద్దు అంటూ జాప్యం చేశారని విమర్శించారు.తమకు అధికారం అప్పగిస్తే చంద్రబాబు, జగన్ లా ప్రజలను విభజించేలా చేయమని..సమైక్యంగా ఉండేలా చేస్తామన్నారు. ప్రతి జిల్లాను అద్భుతంగా..ప్రతి జిల్లాను క్యాపిటల్ గా మారుస్తామని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు.

 

Similar News