కరోనా నుంచి కోలుకున్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తన సహజశైలిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఎటాక్ ప్రారంభించారు. అమరావతి వ్యవహారంపై ఆయన చంద్రబాబు తీరును తప్పుపట్టారు. ‘20 మంది ఎమ్మెల్యేలా..? లేక.. బినామీల పేరిట కొన్న భూములకు లక్ష కోట్లా.. అన్న ప్రశ్నకు,. ఎమ్మెల్యేలు పోతే పోయారుగానీ.. లక్ష కోట్లే కావాలని బాబు అంటున్నాడు. బాబు దృష్టిలో అమరావతి ఎంతో "విలువైనది"!’’ అంటూ ట్వీట్ చేశారు.