నకిలీ మందులపై కొరడా

Update: 2020-08-03 16:40 GMT

నకిలీ మందుల వ్యవహారంపై కొరడా ఝుళిపించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాల విషయంలో ఏ మాత్రం ఉదాసీనంగా ఉండొద్దన్నారు. సీఎం జగన్ సోమవారం నాడు డ్రగ్ కంట్రోల్ అంశంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 285కిపైగా యూనిట్లు,34వేలకు పైగా ఔషధాలు అమ్మే దుకాణాలు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. పరిమితమైన మానవవనరులు, ల్యాబ్‌ సామర్ధ్యం తక్కువగా ఉందని, నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. డ్రగ్‌ కంట్రోల్‌ కార్యకలపాలు బలోపేతంగా ఉండాలని స్పష్టం చేశారు. విజయవాడలో ఉన్న ల్యాబ్‌తోపాటు కొత్తగా నిర్మాణంలో ఉన్న కర్నూలు, విశాఖపట్నం ల్యాబ్‌ల్లో సామర్ధ్యం పెంపునకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. డ్రగ్‌ తయారీ యూనిట్లలోనూ నాణ్యతపై దృష్టిపెట్టాలని సూచించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గొప్ప విధానాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. థర్ట్‌ పార్టీ తనిఖీలు జరిగేలా చూడాలన్నారు.

Similar News