నాని, సుదీర్ బాబులు కలసి నటిస్తున్న సినిమా ‘వి’. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ విడుదల కానుంది. వీరికి జోడీగా నివేదా థామస్, అదితిరావు హైదరీలు జోడీగా నటిస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ బుధవారం నాడు ట్రైలర్ విడుదల చేసింది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా ఉండగా, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా నాని కెరీర్లో 25వ సినిమా. నాని, సుధీర్‌బాబు మధ్య యాక్షన్, ఛేజింగ్ సీన్స్ థ్రిల్లింగ్‌గా ఉన్నాయి.
https://www.youtube.com/watch?time_continue=6&v=eBcYKDUT8fs&feature=emb_logo